Video : సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి భయం లేదు.. గురుమంత్రం స్వీకరించాక యశస్వి ఏమ‌న్నాడంటే..

ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

By Kalasani Durgapraveen  Published on  21 Nov 2024 11:25 AM IST
Video : సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి భయం లేదు.. గురుమంత్రం స్వీకరించాక యశస్వి ఏమ‌న్నాడంటే..

ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బీసీసీఐ షేర్ చేసిన వీడియో ద్వారా 'కంగారూ'లకు సవాలు విసిరాడు. పెర్త్ టెస్టులో యశస్విపై భారీ అంచనాలున్నాయి. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో యశస్వి జట్టుకు శుభారంభం ఇచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టుకు ముందు, తాను విరాట్ కోహ్లీ నుండి గురుమంత్రాన్ని స్వీకరించానని.. ఆస్ట్రేలియాలో తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేయడమే తన లక్ష్యమని యశస్వి వీడియో ద్వారా చెప్పాడు.

బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో.. నాకు ఇక్కడ ఆడే అవకాశం లభించినందుకు నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను..నేను బాగా ఆడాలి యశస్వి చెప్పాడు. ఇక్కడ ప‌రిస్థితి వేరు, బంతి వేరు, వికెట్లు వేరు. మేము మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. నేను నిజంగా ఆ పిచ్‌పై ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.. నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ పిచ్ గురించి నేను తరచుగా పురాణగాథలు చెప్పడం విన్నాను. నేను కూడా ఆ క్షణాన్ని అనుభూతి చెందాలని.. చిరునవ్వుతో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను.

నేను సీనియర్ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి.. విరాట్ పాజీని చాలా అడుగుతుంటాను. మూడు ఫార్మాట్లలో ఆడాలంటే రోజూ ప్రాక్టీస్ చేయాలని పాజీ చెప్పాడు. విరాట్ భాయ్‌ని చూసి, నేను చాలా ప్రేరణ పొందాను.. ప్రతిరోజూ నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను ప్రాక్టీస్‌కి వెళ్లినప్పుడల్లా నాతో పాటు ఏదో ఒక ప్లాన్‌ తీసుకుని వెళ్తాను. నేను ఎక్కువగా నిద్రపోవడం, బాగా తినడంపై దృష్టి సారిస్తాను. ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి భయం లేకుండా ఆడాలని పేర్కొన్నాడు.


Next Story