విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌ స్టైల్‌.. ఫోటోలు వైర‌ల్‌

Virat Kohli Gets a stylish haircut photos viral.విరాట్ కోహ్లీ త‌న హెయిర్ స్టైల్‌ను మార్చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2022 2:46 PM IST
విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌ స్టైల్‌.. ఫోటోలు వైర‌ల్‌

ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. విరాట్ ఎయిర్‌ ఫోర్ట్‌లో దిగిన ఫోటోలు, వీడియోల‌ను పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్(పీసీఏ) సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. అంద‌మైన న‌గ‌రంలోకి విరాట్‌కు స్వాగ‌తం అంటూ రాసుకొచ్చింది. అయితే.. ఇందులో విరాట్ కోహ్లీ చాలా స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. త‌న హెయిర్ స్టైల్‌ను మార్చేశాడు. విరాట్ కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కోహ్లీ ఈ కొత్త రూపు సెల‌బ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ ర‌షీద్ స‌ల్మానీ తీసుకువ‌చ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో పంచుకున్నాడు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ చాలా బాగున్నాడ‌ని, మ‌రింత హాట్ గా మారాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మవుతున్న కోహ్లీ ఎట్ట‌కేల‌కు ఆసియా క‌ప్‌లో ఫామ్‌లో అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్ పై శ‌త‌కాన్ని బాది విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టి స‌మాధానం చెప్పాడు. మొత్తంగా ఆసియా క‌ప్ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేసి ఈ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. మంగళవారం టీమ్ఇండియా మొహాలీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

Next Story