Video : 'నా దారికి అడ్డు రాకు..' అంటూ కోపంతో వెళ్లిపోయిన కోహ్లీ..!
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కలవాలనుకునే వ్యక్తి విరాట్ కోహ్లీ. ఆయన్ను చూసిన వెంటనే అభిమానులు ఆయన వద్దకు చేరుకుని చుట్టుముడతారు.
By Medi Samrat Published on 17 Jan 2025 10:02 AM ISTఈ దేశంలో ప్రతి ఒక్కరూ కలవాలనుకునే వ్యక్తి విరాట్ కోహ్లీ. ఆయన్ను చూసిన వెంటనే అభిమానులు ఆయన వద్దకు చేరుకుని చుట్టుముడతారు. ఈ కారణంగా విరాట్ కోహ్లీ కొన్నిసార్లు తన కోరిక మేరకు వీధుల్లో తిరగలేడు. అతను ఈ విషయాన్ని చాలాసార్లు అంగీకరించాడు. తాజాగా మరోసారి కోహ్లీని భారత వీధుల్లో చూసి అభిమానులు చుట్టుముట్టారు.
కోహ్లీ కూడా తన అభిమానులతో బాగా కలిసిపోతాడు. చాలాసార్లు సెల్ఫీలు కోసం ఎగబడ్డ వారి కోరికను తీర్చాడు, కానీ ఈసారి కోహ్లీ తన అభిమానిపై కోపంగా ఉన్నాడు. కాస్త కోపంతో అభిమానిని దూరంగా ఉండమని కోరాడు. ఆ సమయంలో కోహ్లీ ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది.
కోహ్లీ నడుచుకుంటూ వెళ్తుండగా.. అభిమానులు అతని వెంట పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు కోహ్లీ.. బ్రదర్.. నా దారికి అడ్డురాకు.. అని అంటాడు. ఆ సమయంలో కోహ్లీ స్వరంలో చికాకు స్పష్టంగా విన(కన)బడుతుంది. ఆ అభిమాని కోహ్లీతో సెల్ఫీ తీసుకోవాలనుకోగా.. కోహ్లీ అతనిని తేలికగా పక్కకు నెడతాడు.. అప్పుడు కోహ్లీ ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Bhai Mera rasta mat Roko 😬 pic.twitter.com/sqWkwDjVxt
— TEJASH 🚩 (@LoyleRohitFan) January 14, 2025
ప్రస్తుతం కోహ్లీ ఫామ్ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. అతడు ఐదు మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేశాడు, అందులో ఒక సెంచరీ మాత్రమే ఉంది, పెర్త్‌లో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను సెంచరీ చేశాడు.
దీంతో టీమ్ ఇండియాలో మార్పు జరుగనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిరీస్ తర్వాత బీసీసీఐ అధికారులు, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనని స్పష్టంగా పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలు నిజమా..? కాదా.? అనేది తెలియాల్సివుంది.