జై షాను ప్రత్యేకంగా అభినందించిన విరాట్ కోహ్లీ.. నిమిషాల్లో వైరల్‌గా మారిన ట్వీట్

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికైన జయ్ షాను ప్రత్యేకంగా అభినందించాడు.

By Medi Samrat  Published on  28 Aug 2024 7:22 PM IST
జై షాను ప్రత్యేకంగా అభినందించిన విరాట్ కోహ్లీ.. నిమిషాల్లో వైరల్‌గా మారిన ట్వీట్

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికైన జయ్ షాను ప్రత్యేకంగా అభినందించాడు. గ్రెగ్ బార్ల్కే స్థానంలో ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జే షా ఐసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గ్రెగ్ పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది.యు డిసెంబరు 1 నుండి జే షా కొత్త ICC బాస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 35 ఏళ్ల జే షా ఐసీసీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఎన్నికై అరుదైన రికార్డు సాధించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ ఐదవ భారతీయుడు జే షా.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి హాలిడేలో ఉన్నాడు. ఇటీవ‌ల‌ శిఖర్ ధావన్‌ రిటైర్‌మెంట్‌పై అభినందనలు తెలిపిన కోహ్లీ తాజాగా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన జే షాను అభినందించారు. ఐసిసి కొత్త ఛైర్మన్‌గా ఎంపికైనందుకు మీకు అభినందనలు అంటూ కోహ్లి జై షాకు లేఖ రాశాడు. మున్ముందు మ‌రిన్ని విజ‌యాలు సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ఐసీసీ తదుపరి ఛైర్మన్‌గా జే షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షా అక్టోబర్ 2019లో బీసీసీఐ కార్యదర్శి పదవి బాధ్యతలను స్వీకరించారు. జనవరి 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నిక‌య్యారు. ఇప్పుడు 1 డిసెంబర్ 2024న ICC ఛైర్మన్ పదవిని చేపట్టనున్నారు.

Next Story