Video : ఆ ఒక్క మాట‌తో అంద‌రినీ ఆశ్చర్యప‌రిచిన కోహ్లీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు, క్రికెట్ ప్రేమికులకు పెద్ద అప్‌డేట్ అందించాడు.

By Medi Samrat
Published on : 1 April 2025 2:51 PM IST

Video : ఆ ఒక్క మాట‌తో అంద‌రినీ ఆశ్చర్యప‌రిచిన కోహ్లీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు, క్రికెట్ ప్రేమికులకు పెద్ద అప్‌డేట్ అందించాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఒక ఈవెంట్‌లో పెద్ద విషయాన్ని వెల్లడించాడు. తన అభిమానులు నమ్మలేని విషయాన్ని చెప్పాడు. ప్ర‌స్తుతం విరాట్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు భయపడ్డారు. అయితే ఆ త‌ర్వాత‌ మీడియా సమావేశానికి వచ్చిన రోహిత్ శర్మ మాత్రం తాను ఇప్పట్లో రిటైర్మెంట్ అవ్వ‌డం లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ.. రిటైర్మెంట్‌పైనే కాకుండా వన్డే ప్రపంచకప్ 2027పై కూడా పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు.

మీరు వేయ‌బోయే తదుపరి పెద్ద అడుగు గురించి ఏదైనా హింట్‌ ఇవ్వగలరా? అని విరాట్ కోహ్లీని అడ‌గ‌గా "తదుపరి వేయ‌బోయే పెద్ద అడుగు? గురించి నాకు తెలియదు. బహుశా 2027లో వచ్చే వరల్డ్‌కప్‌ను గెలవడానికి ప్రయత్నించవచ్చని పేర్కొన్నాడు." ఈ సమాధానంతో ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. దీంతో అతని దృష్టి 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌పై కూడా ఉందని తెలుస్తుంది.

విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఆడుతూ బిజీగా ఉన్నాడు. లీగ్ 18వ సీజన్‌లో RCB ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడింది. రెండింటిలోనూ విజయం సాధించింది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు.

Next Story