సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli Breaks Sachin Record. శ్రీలంకతో జరుగుతున్న తొలి వ‌న్డేలో శ‌త‌కం బాదిన‌ విరాట్ కోహ్లీ ప్ర‌పంచ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టాడు.

By Medi Samrat  Published on  10 Jan 2023 2:45 PM GMT
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

శ్రీలంకతో జరుగుతున్న తొలి వ‌న్డేలో శ‌త‌కం బాదిన‌ విరాట్ కోహ్లీ ప్ర‌పంచ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టాడు. వ‌న్డేల్లో 45వ, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 73వ శ‌త‌కం సాధించిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క‌ర్ రికార్డును స‌మం చేశాడు. స్వ‌దేశంలో 20 సెంచ‌రీలు చేసిన రెండో బ్యాట‌ర్‌గా గుర్తింపు సాధించాడు. స్వ‌దేశంలో త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో 20 సెంచ‌రీలు కొట్టిన బ్యాట‌ర్‌గా రికార్డు నమోదు చేసాడు. 99 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 20 సెంచ‌రీల‌కు 160 ఇన్సింగ్స్‌లు తీసుకున్నాడు. సొంత గ‌డ్డ‌పై అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన వాళ్ల‌లో ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు హ‌షీం ఆమ్లా (69 ఇన్నింగ్స్‌), ఆసీస్ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ (151 ఇన్నింగ్స్‌) త‌లా 14 శ‌త‌కాల‌తో మూడో స్థానంలో ఉన్నారు. ఒకే జ‌ట్టు మీద అత్య‌ధిక సెంచ‌రీలతో స‌చిన్ రికార్డును కోహ్లీ స‌మం చేశాడు. శ్రీ‌లంక‌, వెస్టిండీస్ జ‌ట్ల మీద 9 సార్లు అత‌ను వంద ప‌రుగులు చేశాడు. స‌చిన్, ఆస్ట్రేలియా మీద 9 సెంచ‌రీలు కొట్టాడు. రోహిత్ శ‌ర్మ, ఆసీస్‌పై 8 సెంచ‌రీల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

తొలి వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 113 పరుగులు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ 83, గిల్ 70 పరుగులు చేసి శుభారంభం అందించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. కోహ్లీకి శ్రేయాస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39) నుంచి చక్కని సహకారం లభించింది. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు. మధుశంక 1, కరుణరత్నే 1, షనక 1, ధనంజయ డిసిల్వా 1 వికెట్ తీశారు.


Next Story
Share it