మ‌రో రికార్డు బ్రేక్ చేశాడు.. కోహ్లీనే టాప్‌..!

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇటీవ‌ల ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డును బద్దలు కొడుతున్నారు.

By Medi Samrat  Published on  4 March 2025 6:51 PM IST
మ‌రో రికార్డు బ్రేక్ చేశాడు.. కోహ్లీనే టాప్‌..!

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇటీవ‌ల ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డును బద్దలు కొడుతున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీఫైనల్‌లో కూడా కింగ్ కోహ్లి ఓ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ భారీ రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఈ క్ర‌మంలోనే భారత జట్టు మాజీ ఆట‌గాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నంబర్-1 స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు (టెస్ట్, వన్డే, టీ20) మొత్తం 440 క్యాచ్‌లు పట్టిన శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే పేరిట ఉంది. ఈ విషయంలో రికీ పాంటింగ్ మొత్తం 364 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ 351 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. జాక్వెస్ కలిస్ 338 క్యాచ్‌లతో నాలుగో స్థానానికి చేరుకోగా, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జోష్ ఇంగ్లీష్ క్యాచ్ పట్టడం ద్వారా కింగ్ కోహ్లీ ఈ రికార్డు సృష్టించాడు. కోహ్లీ 549 అంతర్జాతీయ మ్యాచ్‌ల‌లో 335 క్యాచ్‌లు పట్టి రికార్డు సృష్టించాడు. అదే సమయంలో ద్రావిడ్ తన కెరీర్‌లో 509వ అంతర్జాతీయ మ్యాచ్‌ల‌లో 334 క్యాచ్‌లు ప‌ట్టాడు.

భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ- 335 క్యాచ్‌లు

రాహుల్ ద్రవిడ్- 334 క్యాచ్‌లు

మహ్మద్ అజారుద్దీన్- 261 క్యాచ్‌లు

సచిన్ టెండూల్కర్- 256 క్యాచ్‌లు

రోహిత్ శర్మ- 229 క్యాచ్‌లు

Next Story