భారీగా ఖ‌ర్చు పెట్టి ఫాంహౌస్‌ సొంతం చేసుకున్న కోహ్లీ..!

Virat Kohli and Anushka Sharma buy farmhouse in Alibaug worth Rs. 19.24 cr. ఆసియా కప్ 2022లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.

By Medi Samrat  Published on  3 Sep 2022 11:00 AM GMT
భారీగా ఖ‌ర్చు పెట్టి ఫాంహౌస్‌ సొంతం చేసుకున్న కోహ్లీ..!

ఆసియా కప్ 2022లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇటీవలే అలీబాగ్‌లో ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని కొనుగోలు చేశాడనే వార్తలు వస్తున్నాయి. భార్య అనుష్క శర్మతో కలిసి దాదాపుగా ఎనిమిది ఎకరాల భూమిని అతడు కొన్నట్లు తెలుస్తోంది. విరుష్క దంపతులు సుమారుగా పందొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అలీబాగ్‌కు సమీపంలోని జిరాద్‌ గ్రామంలో ఫామ్‌హౌజ్‌ సొంతం చేసుకోవాలని కోహ్లి దంపతులు భావించారు. కోహ్లి, అనుష్క ఆర్నెళ్ల క్రితమే జిరాద్‌ను సందర్శించి ఇందుకోసం డీల్‌ కుదుర్చుకున్నారు. విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించి కోహ్లి దంపతులు 1.15 కోట్ల రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. గురువారమే ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.

ముంబైలోని జుహు శివారులోని నటుడు-గాయకుడు కిషోర్ కుమార్ కుటుంబానికి చెందిన "గౌరీ కుంజ్" బంగ్లాలో కొంత భాగాన్ని సొంతం చేసుకున్నారని, ఆ స్థలంలో తన రెస్టారెంట్‌ను తెరవడానికి సిద్ధమవుతున్నాడని కూడా నివేదికలు వచ్చాయి. కోహ్లి ఇప్పటికే 'వన్‌8' బ్రాండ్‌ పేరిట ఇప్పటికే క్లాత్‌, షూస్‌, ఆతిథ్య రంగాలలో పెట్టుబడులు పెట్టాడు. కోహ్లి ప్రస్తుతం ఆసియాకప్‌-2022 టోర్నీతో బిజీగా ఉన్నాడు. హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అర్ధ శతకం బాది అభిమానులను అలరించాడు. రేపు పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఎలా రాణిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.


Next Story
Share it