క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో లెజెండరీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో థానేలోని అకృతి ఆసుపత్రిలో చేరారు.

By Medi Samrat  Published on  23 Dec 2024 5:02 PM IST
క్షీణించిన ఆరోగ్యం.. ఆసుపత్రిలో లెజెండరీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో థానేలోని అకృతి ఆసుపత్రిలో చేరారు. వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాంబ్లీ ఇటీవల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటీవల ముంబైలోని శివాజీ పార్క్‌లో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన బహిరంగంగా కనిపించారు.

1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కాంబ్లీ కోలుకోడానికి తమ మద్దతును ప్రకటించారు. ఆర్థిక సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహాయం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు, అయితే పునరావాసంలో తప్పకుండా ఉండాలంటూ ఒక షరతుగా సూచించారు

Next Story