నా సర్జరీలకు సహాయం చేసిందే సచిన్ టెండూల్కర్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ నుండి పొందిన ఆర్థిక సహాయంపై స్పందించాడు.

By Medi Samrat  Published on  13 Dec 2024 3:15 PM GMT
నా సర్జరీలకు సహాయం చేసిందే సచిన్ టెండూల్కర్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ నుండి పొందిన ఆర్థిక సహాయంపై స్పందించాడు. తన కష్ట సమయాల్లో టెండూల్కర్ ఎలా మద్దతుగా నిలిచాడో వినోద్ కాంబ్లీ వివరించాడు. నాకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. నా భార్య నన్ను లీలావతి ఆసుపత్రికి తరలించింది. అప్పుడు నాకు సహాయం చేసింది సచిన్. 2013లో నా రెండు సర్జరీల కోసం డబ్బు చెల్లించాడని కాంబ్లీ ది వికీ లల్వానీ షోలో చెప్పాడు. సచిన్ నాకు సహాయం చేయలేదని నేను భావించాను.. నిజం ఏమిటంటే, అతను నా కోసం ప్రతిదీ చేసాడు. మా చిన్ననాటి బంధం ఎప్పుడూ దృఢంగానే ఉంటుందని వినోద్ కాంబ్లీ తెలిపారు.

ముంబైలోని రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ ప్రారంభోత్సవంలో టెండూల్కర్, ఇతర మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆ సమయంలో కాంబ్లీ బలహీనంగా కనిపించడంతో అతని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్, బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సహా క్రికెట్ సోదరుల సభ్యులు కాంబ్లీ పునరావాసం కోసం తమ మద్దతును అందించారు.

Next Story