కోలుకున్న సచిన్ స్నేహితుడు..!

భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. కాంబ్లీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు

By Medi Samrat  Published on  10 Aug 2024 3:49 PM IST
కోలుకున్న సచిన్ స్నేహితుడు..!

భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. కాంబ్లీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. తను పూర్తిగా క్షేమంగా ఉన్నాన‌ని అభిమానులకు చెప్పాడు. అంత‌కుముందు కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో న‌డ‌వ‌లేక‌పోతున్న‌ట్లు కనిపించాడు. దీంతో అతడికి సహాయం చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ‌చ్చాయి.

భారత్ తరఫున 117 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కాంబ్లీ తన ఆరోగ్యంపై అభిమానులకు ఓ అప్‌డేట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో కాంబ్లీ ఫిట్‌గా, నవ్వుతూ కనిపించాడు. థంబ్స్ అప్ సిగ్న‌ల్‌తో అంతా కరెక్ట్ అని చెప్పాడు. దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను, ఫిట్‌గా ఉన్నాను’ అని ఆయన వీడియోలో చెప్పడం వినవచ్చు.

సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, సహచర క్రికెటర్ వినోద్ కాంబ్లీ. అత‌డు 100 వన్డేలు, 17 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10,000కు పైగా ప‌రుగులు సాధించాడు. ఇందులో అత‌ని అత్య‌ధిక‌ వ్య‌క్తిగ‌త స్కోరు 262 పరుగులు.


Next Story