భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ఆదివారం మధ్యాహ్నం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కాంబ్లీ బాంద్రాలోని తన రెసిడెన్షియల్ సొసైటీ గేటును కారుతో ఢీకొట్టినందుకు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘటన తర్వాత కాంప్లెక్స్ వాచ్‌మెన్, కొంతమంది సొసైటీలోని నివాసితులతో వాదనకు దిగాడు. సొసైటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాంబ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసు అధికారి చెప్పాడు. కాంబ్లీపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద అభియోగాలు మోపినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
ఇదిలావుంటే.. వినోద్ కాంబ్లీ భారత్ తరుపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. సచిన్ సన్నిహితుడిగా వినోద్ కాంబ్లీకి పేరు. వీరువురు స్కూల్ క్రికెట్ చరిత్నలో అత్యధిక పరుగుల బాగస్వామ్యాన్ని నమోదుచేశారు. టెస్టుల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు బాదిన కాంబ్లీ.. వన్డేలలో రెండు శతకాలు, పద్నాలుగు అర్ధ శతకాలు నమోదుచేశాడు. వివాదరహితుడిగా పేరున్న వినోద్ కాంబ్లీ కెరీర్ త్వరగా ముగిసింది.