ఒలింపిక్స్ గేమ్స్ ముగిసేలోగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం రావొచ్చునని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తెలిపింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ కు ముందు ఫొగాట్ 100 గ్రాములు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో ఫైనల్లో ఆడలేకపోయింది. అయితే తనకు రజతం రావాలంటూ తన అనర్హతపై క్రీడా కోర్టులో సవాల్ చేసింది. ఈ అభ్యర్థనను ఆర్పిట్రేషన్ కోర్టు స్వీకరించి, విచారణ జరుపుతోంది.
అప్పీలు సందర్భంగా వినేష్ వాదనలు
- ఎలాంటి మోసం చేయలేదు
- శరీరం సహజ పునరుద్ధరణ ప్రక్రియ కారణంగా బరువు పెరిగింది.
- పోటీ మొదటి రోజున శరీర బరువు నిర్ణీత పరిమితిలో ఉంది.
- బరువు పెరగడం ఆమె రికవరీ ప్రక్రియలో భాగంగా మాత్రమే జరిగింది, ఇది మోసం కాదు.
- కోలుకోవడానికి అవసరమైన పోషకాలతో తన శరీరాన్ని తిరిగి నింపుకునే హక్కు ఉంది.