ఆసుపత్రి పాలైన వినేష్.. ఆరోగ్యం ఎలా ఉందంటే.?

రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫైనల్ నుండి అనర్హత వేటు పడిన నిమిషాల తర్వాత.. పారిస్‌లో ఆసుపత్రి పాలైంది

By Medi Samrat  Published on  7 Aug 2024 9:50 AM GMT
ఆసుపత్రి పాలైన వినేష్.. ఆరోగ్యం ఎలా ఉందంటే.?

రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫైనల్ నుండి అనర్హత వేటు పడిన నిమిషాల తర్వాత.. పారిస్‌లో ఆసుపత్రి పాలైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె స్పృహ కోల్పోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫైనల్ రోజు.. బుధవారం వెయిట్-ఇన్ సమయంలో వినేష్ ఫోగట్ 150 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా అనర్హత ప్రకటించింది. ప్రస్తుతం, వినేష్ ఒలింపిక్ విలేజ్‌లోని పాలిక్లినిక్‌లో ఉంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, విశ్రాంతి తీసుకుంటోందని తెలిపారు. వినేష్, ఆమె కోచ్‌లు, సహాయక సిబ్బంది, ఆమె జుట్టును కత్తిరించడం మరియు రక్తాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించడం వంటి తీవ్రమైన చర్యలను తీసుకున్నప్పటికీ .. వారు ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారు.

మహిళల 50 కేజీల ఫైనల్‌కు ముందు వినేష్ ఫోగాట్ అధిక బరువు కారణంగా అనర్హురాలైంది. దీంతో భారత రెజ్లర్ తన పతకాన్ని కోల్పోతుంది. సమ్మర్ గేమ్స్‌లో 50 కేజీల విభాగంలో ఒక బంగారు పతకం, రెండు కాంస్యాలు ఉంటాయి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ టెక్నికల్ డెలిగేట్ మాట్లాడుతూ జపనీస్ యుయి సుసాకో, ఉక్రేనియన్ ఒక్సానా లివాచ్ మధ్య జరిగే రెపెచేజ్ రౌండ్ కాంస్య పతక పోటీగా మారుతుందని చెప్పారు. సెమీఫైనల్‌లో వినేష్ ఫోగట్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం పోరాడనుంది.

Next Story