భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సిల్వర్ మెడల్‌కు అర్హురాలు అంటూ ఆమె తరఫున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) ను కోరుతోంది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది. వినేశ్ ఫొగాట్ తరఫున జోయెల్ మోన్లూయీస్, ఎస్టేల్ ఇలనోవా వాదనలు వినిపించనున్నారు. ఆమె పిటిషన్‌ను కోర్టు సమర్థించడంతో.. ఆమె తరపున వాదనలు విననుండటంతో సిల్వర్ మెడల్ ఆశలు సజీవంగా కనిపిస్తున్నాయి.
కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS).. మధ్యవర్తిత్వం ద్వారా క్రీడలకు సంబంధించిన వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి 1984లో స్థాపించబడిన ఒక స్వతంత్ర సంస్థ. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో ఉంది. న్యూయార్క్ నగరం, సిడ్నీలలో కోర్టులు ఉన్నాయి.. ఒలింపిక్ హోస్ట్ నగరాల్లో తాత్కాలిక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు. CAS ఏ క్రీడా సంస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (ICAS) యొక్క అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అథారిటీ కింద పనిచేస్తుంది. CAS మధ్యవర్తిత్వం ద్వారా క్రీడా రంగంలో చట్టపరమైన వివాదాలను పరిష్కరిస్తుంది. వినేశ్ అప్పీల్ గెలిస్తే ఆమెకు రజతం దక్కుతుంది. వినేశ్ అప్పీల్‌ను కోల్పోతే, అనర్హత ఫలితం అలాగే మిగిలి ఉంటుంది.