వినేష్‌కు ప‌త‌కంపై నిర్ణ‌యం రేపే..

శుక్రవారం నాడు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో వినేష్ ఫోగట్‌కు సంబంధించి విచారణ జరిగింది.

By Medi Samrat  Published on  10 Aug 2024 10:20 PM IST
వినేష్‌కు ప‌త‌కంపై నిర్ణ‌యం రేపే..

శుక్రవారం నాడు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో వినేష్ ఫోగట్‌కు సంబంధించి విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు నిర్ణయం వెలువడాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ఆ గడువును పొడిగించినట్లు భారత ఒలింపిక్ సంఘం వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి. ఆగస్టు 13న నిర్ణయం వెలువడుతుందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. అయితే, 10 నిమిషాల తర్వాత మ‌రో కొత్త అప్‌డేట్ ఇచ్చింది. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ ఆగస్టు 11న తన నిర్ణయాన్ని ఇస్తుంద‌ని పేర్కొంది. అంటే వినేష్ విషయంలో ఆదివారం నిర్ణయం రానుంది. ఆమెకు రజత పతకం ఇవ్వాలని వినేశ్‌ స్పోర్ట్స్‌ ట్రిబ్యునల్‌ను కోరింది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ పై ఫైనల్‌కు ముందు అనర్హత వేటు ప‌డింది. దీంతో వినేష్‌ స్పోర్ట్స్‌ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ దాఖలు చేసి.. తనకు రజతం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనిపై విచారణ పూర్తయినా తీర్పు వెలువడలేదు.

Next Story