వినేష్ ఫోగట్ జుట్టును కూడా కత్తిరించారట.. అయినా కూడా..!

2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ స్వర్ణం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది.

By Medi Samrat  Published on  7 Aug 2024 2:53 PM IST
వినేష్ ఫోగట్ జుట్టును కూడా కత్తిరించారట.. అయినా కూడా..!

2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ స్వర్ణం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది. ఆమెకు రజతం లేదా బంగారు పతకం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అయితే దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా.. ఫోగాట్ మహిళల 50 కిలోల ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉందని గుర్తించడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఎటువంటి పతకం లేకుండా పారిస్ నుండి ఆమె తిరిగి వస్తోంది.

50 కిలోల బరువు తగ్గడం కోసం వినేష్, కోచ్‌లు, ఆమె సహాయక సిబ్బంది సహాయం చేయడానికి ప్రతిదీ చేసారు. ఆమె జుట్టును కత్తిరించడం నుండి రక్తం తీయడానికి కూడా ప్రయత్నించారని.. అయినా కూడా ఆమె బరువు తగ్గలేదని తెలుస్తోంది. ఇంకొంచెం సమయం కావాలని వినేష్ బృందం కోరినా కూడా ఒలింపిక్ కమిటీ పట్టించుకోలేదని తెలుస్తోంది. వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై భారత్ అప్పీల్‌కు వెళ్ళిది. ఆమెపై అనర్హత వేటు పడటంతో.. ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story