USA కోచింగ్ టీమ్‌లో ఆంధ్రా మాజీ క్రికెటర్

యూఎస్ఏ పురుషుల క్రికెట్‌ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఆంధ్రా మాజీ క్రికెటర్ విన్సెంట్ వినయ్ కుమార్ ఎంపికయ్యాడు

By Medi Samrat  Published on  8 Aug 2024 9:15 PM IST
USA కోచింగ్ టీమ్‌లో ఆంధ్రా మాజీ క్రికెటర్

యూఎస్ఏ పురుషుల క్రికెట్‌ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఆంధ్రా మాజీ క్రికెటర్ విన్సెంట్ వినయ్ కుమార్ ఎంపికయ్యాడు. 54 ఏళ్ల విన్సెంట్ వినయ్ కుమార్ నెదర్లాండ్స్ పర్యటనలో కోచ్ స్టువర్ట్ లాకు సహాయం చేయనున్నారు. మొనాంక్ పటేల్ నేతృత్వంలోని అమెరికా జట్టు T20 ప్రపంచ కప్ 2024 లో అద్భుతంగా ఆడింది. పాకిస్థాన్ ను ఓడించి సూపర్ ఎయిట్‌ కు అర్హత సాధించింది. అమెరికా జట్టు గణనీయంగా మెరుగుపడిందని, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన జట్లను ఓడించే సత్తా ఉందని వినయ్ కుమార్ తెలిపారు. జట్టు మరింత స్థిరంగా రాణించేలా, ఆటగాళ్లలో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు తాను కృషి చేస్తానని కుమార్ హామీ ఇచ్చారు.

వివిధ వయసుల వారిగా మరిన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ చేస్తూ ఉండడంతో USAలో క్రికెట్ అభివృద్ధి చెందుతోందని వినయ్ కుమార్ తెలిపారు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నమెంట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. సీనియర్ పురుషుల జట్టు మ్యాచ్‌ల సంఖ్యను కూడా పెంచాలని పాలకమండలి యోచిస్తోందని ఆయన వెల్లడించారు. యుఎస్‌లో క్రికెట్ మెరుగుపడుతోందని అన్నారు.

Next Story