క్లబ్ స్థాయి బౌలర్లను కూడా ఆడ‌లేకపోతున్నాడు.. ఓ రేంజ్ ట్రోల్స్‌..!

భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫుడ్ పాయిజన్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ గ‌త‌ మ్యాచ్ ఆడలేదు. ఈరోజు గోవాతో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు.

By -  Medi Samrat
Published on : 6 Jan 2026 9:00 PM IST

క్లబ్ స్థాయి బౌలర్లను కూడా ఆడ‌లేకపోతున్నాడు.. ఓ రేంజ్ ట్రోల్స్‌..!

భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫుడ్ పాయిజన్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ గ‌త‌ మ్యాచ్ ఆడలేదు. ఈరోజు గోవాతో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పటిష్టమైన ఇన్నింగ్స్ ఆడతాడని భావించినా విఫలమయ్యాడు. వైఫల్యం తర్వాత గిల్‌ను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు అభిమానులు.

ఈ మ్యాచ్‌లో గిల్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ ఏడాది పరిమిత ఓవర్లలో గిల్ ఫామ్ అంతగా లేదు. త‌ర‌చూ విఫలమవుతున్నాడు. దీని కారణంగా అతడు T20 ప్రపంచకప్‌కు ప్ర‌క‌టించిన జ‌ట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. గత ఏడు వన్డేల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు.

గోవాపై విఫ‌ల‌మైన‌ గిల్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ఒక వర్గం అతన్ని ఫ్లాట్ పిచ్‌ల రారాజుగా పిలుస్తోంది. క్లబ్ స్థాయి బౌలర్లపై విఫలమయ్యేలా గిల్ పతనం ఉంద‌ని ఒక‌రు వ్యాఖ్యానించారు. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గిల్ గాయపడ్డాడు. ఈ గాయం తర్వాత అతని మొదటి 50 ఓవర్ల మ్యాచ్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానున్న దృష్ట్యా గిల్‌కి ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది కాగా అందులోనూ విఫ‌లమ‌య్యాడు. దీంతో ట్రోల్స్ చేస్తున్నారు.


Next Story