విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన చివరి ODIలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ అజేయంగా 116 పరుగులతో తన తొలి ODI సెంచరీని నమోదు చేశాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది, రోహిత్ శర్మ 75 పరుగులు చేసి 20,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటాడు.
సిరీస్ అనంతరం హోటల్‌లో జరిగిన వేడుకల్లో కోహ్లి జైస్వాల్‌ను కేక్ కట్ చేయమని కోరాడు. కేక్ కట్ చేసిన తర్వాత, జైస్వాల్ రోహిత్‌కు ఒక ముక్క ఇచ్చాడు. అయితే కేక్ తినడం లేదని, తింటే మళ్లీ లావు అయిపోతానని రోహిత్ చెప్పడం వినిపించింది. అయితే కోహ్లి మాత్రం సంతోషంగా కేకు ముక్కను తిన్నాడు.