అయ్యర్ రాకతో ఆర్సీబీలో ఆనందం

దేశవాళీ ఆల్ రౌండర్లు తక్కువగా ఉన్న ఆర్సీబీకి మరో ఆల్ రౌండర్ చేరాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 16 Dec 2025 9:10 PM IST

అయ్యర్ రాకతో ఆర్సీబీలో ఆనందం

దేశవాళీ ఆల్ రౌండర్లు తక్కువగా ఉన్న ఆర్సీబీకి మరో ఆల్ రౌండర్ చేరాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అతని కోసం రూ. 7 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. గత మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ కేవలం రూ. 1 కోటి బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను లక్నో జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌లను ఢిల్లీ క్యాపిటల్స్ చెరో రూ. 2 కోట్లకు కొనుగోలు చేశాయి. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ ఏకంగా రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించింది.

Next Story