ICC Rankings : చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..!
ఐసీసీ పురుషుల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్-1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
By - Medi Samrat |
ఐసీసీ పురుషుల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్-1 ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ తాజా ర్యాంకింగ్ తర్వాత అతడు తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌కు చేరుకున్నాడు. వరుణ్ తన కెరీర్ బెస్ట్ రేటింగ్ 818 పాయింట్లు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన వరుణ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యాడు. వరుణ్‌తో పాటు తిలక్ వర్మ రెండు స్థానాలు ఎగబాకాడు. అర్ష్‌దీప్ సింగ్ నాలుగు స్థానాలు ఎగబాకాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తి మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. ధర్మశాలలో జరిగిన మూడో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన అతనికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లాభించింది. దీంతో వరుణ్ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 818 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ సీమర్ జాకబ్ డఫీ 699 రేటింగ్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం 119 రేటింగ్ పాయింట్ల తేడా ఉండగా.. 34 ఏళ్ల వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ రేటింగ్.. ఆల్ టైమ్ T20I బౌలర్ల టాప్-10 జాబితాలోకి ప్రవేశించాడు.
అత్యధిక బౌలర్ రేటింగ్-పురుషుల T20I
పాకిస్థాన్- ఉమర్ గుల్- 865 రేటింగ్
వెస్టిండీస్- శామ్యూల్ బద్రీ-864 రేటింగ్
న్యూజిలాండ్- డేనియల్ వెట్టోరి-858 రేటింగ్
వెస్టిండీస్-సునీల్ నరైన్- 832 రేటింగ్
ఆఫ్ఘనిస్తాన్- రషిద్ ఖాన్-828 రేటింగ్
తబ్రైజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా) 827 రేటింగ్
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) 822 రేటింగ్
వరుణ్ చక్రవర్తి (భారతదేశం) 818 రేటింగ్
షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్) 811 రేటింగ్
వనిందు హసరంగా (శ్రీలంక) 809 రేటింగ్
ఈ క్రమంలోనే వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రాను కూడా అధిగమించాడు. బుమ్రా తన కెరీర్ బెస్ట్ రేటింగ్ 783 రేటింగ్ T20 ఇంటర్నేషనల్‌లో 1 ఫిబ్రవరి 2017న సాధించాడు, ఇది T20 ఇంటర్నేషనల్‌లో భారత బౌలర్ అత్యుత్తమ రేటింగ్. కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఈ రికార్డును సాధించాడు.