సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ను నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్‌హెచ్ వెల్లడించింది. గత సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన కివీస్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్ధానాన్ని వరుణ్ భర్తీ చేయనున్నాడు. ఆరోన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. జార్ఖండ్‌కు చెందిన వరున్ ఆరోన్ 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 29 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.
ఆరోన్ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రణాళికలను రచిస్తూ ఉంది.