మైదానంలోనే కాదు.. ఎగ్జామ్ సెంట‌ర్‌లో కూడా స‌త్తా చాటాలి..!

క్రికెట్ మైదానంలో త‌న విధ్వంస‌క‌ర‌ బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు CBSE నిర్వహించే 10వ త‌ర‌గ‌తి బోర్డు పరీక్షల‌లో స‌త్తా చాట‌డానికి సిద్ధమ‌వుతున్నాడు.

By -  Medi Samrat
Published on : 12 Feb 2026 9:32 PM IST

మైదానంలోనే కాదు.. ఎగ్జామ్ సెంట‌ర్‌లో కూడా స‌త్తా చాటాలి..!

క్రికెట్ మైదానంలో త‌న విధ్వంస‌క‌ర‌ బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు CBSE నిర్వహించే 10వ త‌ర‌గ‌తి బోర్డు పరీక్షల‌లో స‌త్తా చాట‌డానికి సిద్ధమ‌వుతున్నాడు. ప్లేగ్రౌండ్‌లో బడా బౌలర్లకు చెమటలు పట్టించిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చదువు, క్రికెట్ కెరీర్ సమతూకంగా ఉందోలేదో తెలియ‌డానికి ఇదో పెద్ద పరీక్ష కానుంది.

ఇతర విద్యార్థుల మాదిరిగానే వైభవ్ బోర్డు పరీక్షకు హాజరవుతారని పొద్దార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా తెలిపారు. స్కూల్లో టీచర్లు, స్టూడెంట్స్‌లో చాలా ఉత్సాహం ఉంది.. కానీ వైభవ్ మాత్రం మాకు స్టూడెంట్. ఇది అకడమిక్ పిచ్. పరీక్షా కేంద్రంలో పిల్లలందరికీ ఒకే రకమైన సౌకర్యాలు కల్పిస్తారన్నారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి వీఐపీ సౌకర్యంగానీ, ప్రత్యేక రాయితీగానీ ఇవ్వబోమని చెప్పారు.

బోర్డ్ ఎగ్జామినేషన్‌లో గోప్యత చాలా ముఖ్యమైనదని, అందువల్ల వైభవ్ సూర్యవంశీ కూడా సాధారణ విద్యార్థుల మాదిరిగానే నిర్దేశించిన నియమాలను పాటించవలసి ఉంటుందని ఆయ‌న‌ స్పష్టంగా చెప్పారు.

వైభవ్ సూర్యవంశీ తన ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితిలో ప్రజలు వైభవ్ బోర్డు పరీక్షలను కూడా ప్రత్యేక దృష్టితో చూస్తారు. CBSE 10వ పరీక్షలు 17 ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభమై మార్చి 11 వరకు కొనసాగుతాయి.

Next Story