ప్లే ఆఫ్స్‌కు యూపీ.. జెయింట్స్‌పై విజయం
డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది
By తోట వంశీ కుమార్ Published on 21 March 2023 5:03 AM GMTప్లే ఆఫ్స్‌కు యూపీ వారియర్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లే ఆఫ్ బెర్త్‌లు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఢిల్లీక్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ లు ప్లే ఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా.. తాజాగా యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. సోమవారం నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో వారియర్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. గార్డ్‌నర్ (60 ; 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హేమలత (57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో సత్తాచాటారు. యూపీ బౌలర్లలో పార్షవి, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి చేధించింది. గ్రేస్ హారిస్ (72; 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), తహిలా మెక్‌గ్రాత్ ( 57; 38 బంతుల్లో11 ఫోర్లు)లు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించి జట్టను విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ రెండు వికెట్లు తీసింది. గ్రేస్ హారిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి ఆ రెండూ ఔట్..
మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఢిల్లీక్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న గుజరాత్, బెంగళూరు ఆశలు ఆవిరి అయ్యాయి. ఈ రెండు జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న జట్లలో తొలి స్థానంలో ఎవరు నిలుస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.
వారు నేరుగా ఫైనల్‌కు..
పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు తొలిస్థానంలో నిలిచిన జట్టుతో కప్పు కోసం తలపడనుంది.