28 ఏళ్ల‌కే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి షాకిచ్చిన స్టార్‌ క్రికెట‌ర్‌

Unmukt Chand retires from Indian cricket at the age of 28. భారత యువ‌ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ శుక్రవారం 28 ఏళ్ల‌కే క్రికెట్‌కు

By Medi Samrat
Published on : 13 Aug 2021 6:39 PM IST

28 ఏళ్ల‌కే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి షాకిచ్చిన స్టార్‌ క్రికెట‌ర్‌

భారత యువ‌ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ శుక్రవారం 28 ఏళ్ల‌కే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి షాకిచ్చాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్‌ చంద్‌ స్పష్టం చేశాడు. రిటైర్మెంట్‌ విషయమై బీసీసీఐకి ఉన్ముక్త్ రాసిన లేఖ‌ను ట్విటర్ లో షేర్ చేశాడు. ఉన్ముక్త్.. 2012లో అండర్‌ 19 ప్రపంచకప్ అందించిన జ‌ట్టుకు కెప్టెన్‌.. ఆ ఫైనల్లో ఉన్ముక్త్ (111 పరుగులు నాటౌట్‌) వీరోచిత సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్‌ చంద్ మాట్లాడుతూ.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. తాజా రిటైర్మెంట్‌తో భారత్‌ క్రికెట్‌కు ఇక ప్రాతినిధ్యం వహించలేననే విషయం.. ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. కానీ విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన భారత క్రికెట్‌ ప్రేమికులకు మనస్పూర్తిగా నా ధన్యవాదాలు అని చెప్పుకొచ్చాడు. ఇదిలావుంటే.. ఉన్ముక్త్‌ చంద్‌ 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, టీ20 క్రికెట్‌లో 77 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన చంద్ 1,565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్‌ చంద్‌ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు.


Next Story