కోహ్లీని రెండు సార్లు బౌల్డ్ చేసాడు.. గంభీర్ అత‌డిని రంజీల్లో ఏ రాష్ట్రం నుంచి ఆడతున్నావ‌ని అడిగాడు..!

గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత టాప్ బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్, విరాట్, యశస్వి, రాహుల్‌లకు బౌలింగ్ చేయడానికి వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాక్టీస్ బౌలర్ జంషెడ్ అద‌ర‌గొట్టాడు

By Medi Samrat  Published on  26 Sept 2024 11:09 AM IST
కోహ్లీని రెండు సార్లు బౌల్డ్ చేసాడు.. గంభీర్ అత‌డిని రంజీల్లో ఏ రాష్ట్రం నుంచి ఆడతున్నావ‌ని అడిగాడు..!

గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత టాప్ బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్, విరాట్, యశస్వి, రాహుల్‌లకు బౌలింగ్ చేయడానికి వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాక్టీస్ బౌలర్ జంషెడ్ అద‌ర‌గొట్టాడు. ఫాస్ట్ బౌలర్ జంషెడ్ పేస్, స్వింగ్ తొలిరోజు ఈ టాపార్డ‌ర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరిచాయి. జంషెడ్ విరాట్‌ను నెట్స్‌లో రెండుసార్లు ట్రాప్ చేసి అతని వికెట్ ప‌డ‌గొట్టాడు.

కోచ్ గంభీర్‌తో పాటు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు చాలా మంది జంషెడ్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించారు. లక్నోకు చెందిన ఫాస్ట్ బౌలర్ జంషెడ్ ఆలం గ్రీన్‌పార్క్ స్టేడియంలో టీమ్ ఇండియా నెట్ సెషన్‌లో ప్రాక్టీస్ బౌలర్‌గా చేరాడు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పిలుపు మేరకు వచ్చిన జంషెడ్.. ప్రాక్టీస్ వికెట్‌పై బంతిని వేగంగా విస‌ర‌డంతో పాటు లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్‌తో విరాట్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు.

విరాట్ ఫోటోను చూసి తాను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాడినని జంషెడ్ చెప్పాడు. విరాట్‌కి బౌలింగ్‌ చేసే అవకాశం రాగానే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాన‌ని.. విరాట్ సర్ నా వేగాన్ని మెచ్చుకున్నారని ఆనందం వ్య‌క్తం చేశాడు.

అదే సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్.. త‌న‌ను రంజీల్లో ఏ రాష్ట్రం నుంచి ఆడతున్నావ‌ని అడిగారని జంషెడ్ తెలిపాడు. జంషెడ్ త‌న‌ బౌలింగ్‌లో ఔట్‌స్వింగ్‌తో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. నెట్ సెషన్‌లో టీమ్ ఇండియా అగ్రశ్రేణి ఆటగాళ్ల నుండి నాకు లభించిన ప్రశంసలు నా మనోధైర్యాన్ని పెంచాయని జంషెడ్ తెలిపాడు.

Next Story