ఇండియా వర్సెస్ ఆఫ్ఘన్.. స్టార్ ఆటగాడు దూరం
స్టార్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ భారత్ తో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 10 Jan 2024 4:07 PM ISTస్టార్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ భారత్ తో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. లోయర్-బ్యాక్ సర్జరీ నుండి కోలుకోకపోవడంతో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే రషీద్ ఖాన్ BBL, SA20 లీగ్ లకు దూరమయ్యాడు. రషీద్ జట్టుతో కలిసి చండీగఢ్ వెళ్లాడని, అయితే ఇంకా మ్యాచ్-ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. నవంబర్‌లో జరిగిన ODI ప్రపంచ కప్ తర్వాత వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్, భారత్ టూర్ కు జట్టులోకి ఎంపికయ్యాడు, అయితే అతను కోలుకోడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో భారత్ తో మూడు టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.
లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడని.. వెన్ను నొప్పి కారణంగా సిరీస్ ఆడడం లేదని ఆఫ్ఘన్ కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ ధృవీకరించాడు. "మాకు ముజీబ్ వంటి చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు, వారు చాలా మంది కాంపిటీటివ్ క్రికెట్ ఆడారు. మాకు వారిపై నమ్మకం ఉంది. రషీద్ లేకుండా మేము కాస్త కష్టపడాల్సి ఉంటుంది.. అయితే ఎవరైనా ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి" అని జాద్రాన్ తెలిపాడు. మొహాలీలో జనవరి 11న మొదటి టీ20 జరగనుండగా.. 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరుల్లో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నాయి.