అండర్-19 ప్రపంచకప్ ఫైనల్.. ఎక్కడ చూడొచ్చంటే.?

భారత జట్టును మరో ప్రపంచ కప్ ఊరిస్తూ ఉంది. దక్షిణాఫ్రికాలోని సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియంలో 2024 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు భారత్ తలపడనుంది.

By Medi Samrat  Published on  11 Feb 2024 9:56 AM IST
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్.. ఎక్కడ చూడొచ్చంటే.?

భారత జట్టును మరో ప్రపంచ కప్ ఊరిస్తూ ఉంది. దక్షిణాఫ్రికాలోని సహారా పార్క్ విల్లోమూర్ క్రికెట్ స్టేడియంలో 2024 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు భారత్ తలపడనుంది. ఉదయ్ సహారన్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆరో అండర్-19 ప్రపంచ కప్ టైటిల్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ 2000, 2008, 2012, 2018, 2022లో విజయం సాధించి అత్యధిక సార్లు టైటిల్‌ను గెలుచుకుంది.

ఫైనలిస్టులు ఇద్దరూ అజేయంగా ఫైనల్ కు చేరుకున్నారు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా జట్లను భారత్ ఓడించింది. సూపర్ సిక్స్‌లో భారత్ 214 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను, 132 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. సెమీ-ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు గ్రూప్ దశలో నమీబియా, జింబాబ్వే, శ్రీలంక జట్లను ఆస్ట్రేలియా ఓడించింది. సూపర్ సిక్స్‌లో ఆస్ట్రేలియా 110 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది (DLS పద్ధతి). వర్షం కారణంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫలితం లేదు. సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

భారతదేశం- ఆస్ట్రేలియా మధ్య 2024 U19 ప్రపంచ కప్ ఫైనల్ ఫిబ్రవరి 11, ఆదివారం మధ్యాహ్నం 1:30 PM నుండి జరుగుతుంది. మధ్యాహ్నం 1:00 గంటలకు టాస్ వేస్తారు. భారతదేశం- ఆస్ట్రేలియా మధ్య 2024 అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

Next Story