స్పీడ్ తో అందరికీ షాకిచ్చిన ఉమ్రాన్ మాలిక్
Umran Malik rattles New Zealand with lightning speed on ODI debut. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయాన్ని అందుకుంది.
By M.S.R
తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ పై కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. 307 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. కివీస్ వికెట్ కీపర్ టామ్ లాథమ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ లు చెలరేగడంతో భారత బౌలర్లు తేలిపోయారు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్ తో ఆకట్టుకున్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశాడు. మాలిక్‌కు మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో ఆడే అవకాశం లభించలేదు.. అతనిని బెంచ్ కే పరిమితం చేయడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. మాలిక్ మొదటి ODIలో ఆడాడు. తనదైన ముద్ర వేసుకోడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.
న్యూజిలాండ్ పరుగుల వేటలో ఉన్న సమయంలో.. 16వ ఓవర్ రెండో బంతిని ఉమ్రాన్ మాలిక్ మంచి స్పీడ్ తో బౌలింగ్ వేశాడు. డారిల్ మిచెల్‌కి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏకంగా 153.1 కి.మీ. బాల్ వేశాడు. వేగంతో ఒక జంటను అవుట్ చేయగలిగాడు. నేడు 153.1 కిమీ వేగంతో బంతిని వేయడం విశేషం. ఉమ్రాన్ వన్డేల్లో తన మొదటి బంతిని 145.9 కిమీ వేగంతో వేశాడు. ఉమ్రాన్ మాలిక్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో తొలి వికెట్ తీసుకున్నాడు. డెవాన్ కాన్వేను (24) బోల్తా కొట్టించాడు. ఆపై 19 ఓవర్లో డారిల్ మిచెల్ (11)ను పెవిలియన్‌కు పంపి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచులో తన కోటా 10 ఓవర్లలో 66 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచులో అత్యధికంగా లాకీ ఫెర్గూసన్ 153.4 కిమీ వేగంతో బంతిని సందించాడు.