భారత్‌కు షాక్.. గాయంతో ఉమేశ్ యాదవ్ ఔట్
Umesh Yadav out From Aussies series. తొలి టెస్టు ఘోర పరాభవం నుంచి తేరుకున్న టీమ్ ఇండియా రెండో టెస్టులో
By Medi Samrat Published on 31 Dec 2020 7:20 AM GMTతొలి టెస్టు ఘోర పరాభవం నుంచి తేరుకున్న టీమ్ ఇండియా రెండో టెస్టులో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇదిలా ఉంటే టీమ్ఇండియాను గాయాల బెడద వీడడం లేదు. ఇప్పటికే విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై భారత్ రాగా.. స్టార్ పేసర్ మహ్మద్ షమి గాయంతో సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఉమేశ్ యాదవ్ కూడా షమీ బాటలోనే పయనిస్తున్నాడు. రెండో టెస్టు మూడో రోజు ఆటలో బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయంతో ఉమేశ్ విలవిలలాడాడు. కాలి నొప్పితో మైదానాన్ని వీడాడు.
ఉమేశ్ ను పరీక్షించిన వైద్య బృందం అతడికి రెస్ట్ అవసరం అని సూచించింది. దీంతో మిగతా రెండు టెస్టులకు ఉమేశ్ దూరం అయ్యాడు. ఇక ఈ పర్యటనలో రెండు టెస్టులు ఆడిన ఉమేశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో షమీ స్థానంలో అరంగ్రేటం చేసిన సిరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమేశ్ స్థానంలో ఎవరు జట్టులోకి తీసుకుంటారు అన్న ప్రశ్న అభిమానుల్లో మెదులుతోంది.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. నటరాజన్ టెస్టులో అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో టీ20, వన్డేల్లో అరంగ్రేటం చేసిన ఈ యువ బౌలర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ఒక్కడే అనుభవం ఉన్న బౌలర్. మరీ టీమ్‌మేనేజ్‌మెంట్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే.. శార్దుల్ ఠాకూర్‌ను ఆడించే అవకాశం ఉంది. సిడ్ని వేదికగా జరుగునున్న మూడో టెస్టుకు మరో వారం రోజులు సమయం ఉండడంతో.. మిగతా బౌలర్లను కూడా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది.