బంగ్లాదేశ్ జట్టుకు ఘోర పరాభవం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) క్రికెట్ జట్టు సంచలనాన్ని నమోదు చేసింది. ఏ జట్టు అయినా సరే తమను సీరియస్ గా తీసుకోవాలనే స్టేట్మెంట్ ను పంపింది యుఏఈ.

By Medi Samrat
Published on : 22 May 2025 2:45 PM IST

బంగ్లాదేశ్ జట్టుకు ఘోర పరాభవం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) క్రికెట్ జట్టు సంచలనాన్ని నమోదు చేసింది. ఏ జట్టు అయినా సరే తమను సీరియస్ గా తీసుకోవాలనే స్టేట్మెంట్ ను పంపింది యుఏఈ. టీ-20 సిరీస్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది.

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) తమ క్రికెట్ చరిత్రలో గొప్ప మైలురాయిని చేరుకున్నారు. యుఏఈ క్రికెట్‌కు ఇది ఓ చారిత్రాత్మక క్షణం. యుఏఈ జట్టు చేతిలో సిరీస్ ఓడిపోయిన తొలి టెస్ట్ నేషన్ గా బంగ్లాదేశ్ నిలిచింది. మొదటి టి-20 గెలిచిన తర్వాత, బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయింది, దీంతో యుఏఈపై 1-2 తేడాతో సిరీస్ పరాజయాన్ని నమోదు చేసింది. ఏ ఫార్మాట్‌లోనైనా యుఏఈపై ద్వైపాక్షిక సిరీస్ ఓటమిని ఎదుర్కొన్న మొదటి టెస్ట్ ఆడే దేశంగా అవతరించింది బంగ్లా.

Next Story