13 నోబాల్స్ ఏంటి బుమ్రా..!

Twitter Roasts Jasprit Bumrah For Bowling 13 No-Balls In Single Innings. భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి

By Medi Samrat  Published on  15 Aug 2021 4:43 PM IST
13 నోబాల్స్ ఏంటి బుమ్రా..!

భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 నోబాల్స్‌ వేశాడు. ఈ నేపథ్యంలో అతను ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. 2002లో జహీర్‌ఖాన్‌ విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్‌ వేశాడు. ఆ తర్వాత మరే భారత బౌలర్‌ ఇన్ని నోబాల్స్‌ వేయలేదు. 19 ఏళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్‌ వేసి జహీర్‌తో సమానంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 26 ఓవర్లు వేసి 79 పరుగులిచ్చి ఒక వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ చాలా బాగా బ్యాటింగ్ చేయడమే కాకుండా అజేయంగా 180 పరుగులతో నిలిచాడు. ఇంగ్లాండ్ 27 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యంలో జస్ప్రిత్ బుమ్రా నో-బాల్స్ సహకారం కూడా ఉందని అభిమానులు చెబుతూ ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 17 నో-బాల్స్ వేయబడ్డాయి. అందులో బుమ్రా వేసినవి 13 ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఒక ఓవర్‌లో మూడు నో-బాల్స్ చొప్పున రెండుసార్లు వేశాడు. బుమ్రా నో బాల్స్‌పై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా ట్విట‌ర్‌లో ర‌కర‌కాల ఫోటోలను షేర్ చేస్తూ జోకులు పేలుస్తున్నారు.



Next Story