లోయలో పడ్డ‌ ప్రైవేట్ బస్సు.. 12 మంది దుర్మ‌ర‌ణం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లా హరిపూర్‌ధర్‌లో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.

By -  Medi Samrat
Published on : 9 Jan 2026 5:49 PM IST

లోయలో పడ్డ‌ ప్రైవేట్ బస్సు.. 12 మంది దుర్మ‌ర‌ణం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లా హరిపూర్‌ధర్‌లో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి క్షతగాత్రులను తరలిస్తున్నారు. సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బస్సు కుప్వీ నుంచి సిమ్లా వెళ్తోంది. హరిపూర్‌ధార్‌ సమీపంలో 50 మీటర్ల లోతున్న గుంతలో పడిపోయింది. బస్సులో 30 నుంచి 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు గుంత‌లోంచి రోడ్డుపైకి తీసుకువస్తున్నారు. ప్రమాదంలో బస్సు ముక్కలైపోయింది.

కుప్వీ నుంచి సిమ్లా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సిర్మౌర్ జిల్లాలోని హరిపుర్‌ధార్ సమీపంలో గుంత‌లో పడిపోవడంతో ప్రమాదంలో ప‌న్నెండు మంది మృతి చెందినట్లు ఎస్పీ సిర్మౌర్, నిశ్చింత్ సింగ్ నేగి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సులో 30-35 మంది ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. నేను స్పాట్‌కి వెళ్తున్నాను. పోలీసులు, ఇతర సహాయక బృందాలు క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

Next Story