ఆఫ్ఘనిస్థాన్ లేకపోయినా ట్రై సిరీస్ జరుగుతుంది: పీసీబీ

ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగినప్పటికీ, మూడు దేశాల T20I టోర్నమెంట్ నవంబర్ 17 నుండి 29 వరకు లాహోర్‌లో షెడ్యూల్ ప్రకారం..

By -  అంజి
Published on : 18 Oct 2025 9:20 PM IST

Tri series, despite, Afghanistan, PCB, T20I,  Sri Lanka

ఆఫ్ఘనిస్థాన్ లేకపోయినా ట్రై సిరీస్ జరుగుతుంది: పీసీబీ 

ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగినప్పటికీ, మూడు దేశాల T20I టోర్నమెంట్ నవంబర్ 17 నుండి 29 వరకు లాహోర్‌లో షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తెలిపింది. శ్రీలంక మూడవ జట్టుగా ఉన్న ట్రై-సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో మరికొన్ని బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు PCB సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిన తర్వాత కూడా ట్రై-సిరీస్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది. ప్రత్యామ్నాయ జట్టును పరిశీలిస్తున్నాము. ఖరారు చేసిన తర్వాత, ప్రకటన వెలువడుతుంది. అనుకున్నట్లుగా నవంబర్ 17 నుండి సిరీస్ ప్రారంభమవుతుంది” అని ఆయన అన్నారు.

పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు మరణించారని పేర్కొంటూ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) టోర్నమెంట్ కోసం తమ జట్టును పాకిస్తాన్‌కు పంపడం లేదని ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెట్ క్రీడాకారులు మృతి చెందారు. ఈ ఘటన పాక్టికా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఈ దాడి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) పాకిస్థాన్, శ్రీలంకలతో జరగాల్సిన ముక్కోణపు టి20 సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

Next Story