Viral Video : కోపంతో బ్యాట్ విసిరేసిన శుభ్‌మాన్ గిల్

రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున సెంచరీతో శుభ్‌మాన్ గిల్ రంజీల్లో చిరస్మరణీయమైన పునరాగమనం చేశాడు.

By Medi Samrat  Published on  25 Jan 2025 7:18 PM IST
Viral Video : కోపంతో బ్యాట్ విసిరేసిన శుభ్‌మాన్ గిల్

రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున సెంచరీతో శుభ్‌మాన్ గిల్ రంజీల్లో చిరస్మరణీయమైన పునరాగమనం చేశాడు. టీమ్ లో మిగిలిన బ్యాటర్ల నుండి సరైన మద్దతు లేకపోయినా, గిల్ తన సెంచరీని నమోదు చేశాడు. 171 బంతుల్లో 102 పరుగులు చేసి వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. రంజీ ట్రోఫీలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ లేకపోవడంతో, గిల్ తన అవుట్‌ను సవాలు చేయలేకపోయాడు.

ఈ మ్యాచ్ లో శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా గిల్ అవుట్ అయ్యాడు. బ్యాట్ కు తగిలినా కూడా అంపైర్ ఔట్‌గా ఇచ్చాడని గిల్‌ తన కోపాన్ని వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీలో DRS లేకపోవడంతో, గిల్ అంపైర్ కాల్‌ని సవాలు చేయలేకపోయాడు. గిల్ నిరాశతో తన బ్యాట్‌ని విసిరేశాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో పంజాబ్ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. కర్ణాటక మొదటి ఇన్నింగ్స్ లో 475 పరుగులు చేసింది. ఇక పంజాబ్ రెండో ఇన్నింగ్స్ లో గిల్ మినహా.. ఎవరూ అనుకున్నంత ప్రదర్శన చేయలేకపోయారు. 213 పరుగులకు పంజాబ్ ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ 207 పరుగుల తేడాతో కర్ణాటక విజయాన్ని అందుకుంది.

Next Story