పారాలింపిక్స్‌లో భారత్‌కు మ‌రో రెండు ప‌త‌కాలు

Tokyo Paralympics 2021. టోక్యో పారాలింపిక్స్‌లో ఐదోరోజు భారత్‌కు మ‌రో రెండు ప‌త‌కాలు దక్కాయి. ఈ ఉదయం మహిళల

By Medi Samrat  Published on  29 Aug 2021 1:52 PM GMT
పారాలింపిక్స్‌లో భారత్‌కు మ‌రో రెండు ప‌త‌కాలు

టోక్యో పారాలింపిక్స్‌లో ఐదోరోజు భారత్‌కు మ‌రో రెండు ప‌త‌కాలు దక్కాయి. ఈ ఉదయం మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భవీనా పటేల్ రజత పతకం సాధించగా.. పురుషుల హైజంప్‌ T47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచి.. రజతం సాధించాడు. నిషాద్ 2.06 మీటర్ల హైజంప్‌ చేయడం ద్వారా ఈ ఏడాదిలోనే ఆసియాలో అత్యుత్తమ వక్తిగత ప్రదర్శన చేసిన పారా అథ్లెట్‌గా నిలిచాడు. ఇక ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టౌన్‌సెండ్‌ రోడ్రిక్‌ 2.15 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు.

మరో అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ డిస్కస్‌త్రో విభాగంలో కాంస్యం సాధించాడు. దీంతో భారత్‌కు ఒకే రోజు మూడో పతకం ఖాయం చేశాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన F52 డిస్కస్‌త్రో పోటీల్లో 41 ఏళ్ల వినోద్‌.. 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. డిస్కస్‌ త్రోలో పోలాండ్‌కు చెందిన పీయోటర్‌ కోసెవిక్జ్‌ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా.. క్రోయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండర్‌ 19.98 మీటర్లతో రజతం.. వినోద్‌ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు.


Next Story