జులై 23 నుండి టోక్యో ఒలింపిక్స్.. ఆ విభాగాల్లో పతకాలు సొంతమయ్యేనా..!

Tokyo Olympics. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఒలింపిక్స్

By Medi Samrat  Published on  5 July 2021 2:11 PM GMT
జులై 23 నుండి టోక్యో ఒలింపిక్స్.. ఆ విభాగాల్లో పతకాలు సొంతమయ్యేనా..!
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఒలింపిక్స్ ఒక ఏడాది పాటూ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జులై 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్స కార్యక్రమం నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ఎంసి మేరీ కోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జెండా మోయనున్నారు. ఆగస్టు 8 న జరిగే ముగింపు కార్యక్రమంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా జెండా మోయనున్నాడు. భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) ఈ విషయాన్ని ఆటల నిర్వాహక కమిటీకి తెలియజేసింది.


బాక్సర్ మేరీకోమ్, హాకీ ఆటగాడు మన్ ప్రీత్ సింగ్ మార్చ్ పాస్ట్ లో వీరిద్దరూ భారత త్రివర్ణ పతాకం చేతబూని దేశ క్రీడా బృందానికి ముందు నడవనున్నారు. ముగింపు కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పునియా భారత జెండా మోయనున్నారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లను చీర్ ఫర్ ఇండియా నినాదాంతో ఉత్సాహపరిచారు. ఒలింపిక్స్ కు వెళుతున్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రోత్సహించాలని మోదీ ప్రజలను కోరారు. రియో డి జనీరోలో జరిగిన 2016 క్రీడల ప్రారంభోత్సవంలో దేశం ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా జెండా మోశారు. ఈ సారి ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన పలువురు స్టార్స్ పతకాలు తెచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ రంగాల్లో భారత్ సత్తా చాటే అవకాశం ఉంది.


Next Story