స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆసీస్ టెస్టు కెప్టెన్.. తొలి టెస్టు అనుమానమే..?
Tim Paine in self-isolation. సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఇప్పటికే ఆసీస్ చేరింది. దాదాపు మూడు నెలల పాటు సాగను
By Medi Samrat Published on 16 Nov 2020 12:36 PM GMTసుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఇప్పటికే ఆసీస్ చేరింది. దాదాపు మూడు నెలల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియా దేశ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్ చేస్తున్నారు. వన్డేలు, టీ20లకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికి మొదటి టెస్టు మ్యాచ్‌కు మాత్రం ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిటెస్టుకు వేదికైన ఆడిలైట్‌లో కరోనా తీవ్రత పెరుగుతుండడమే అందుకు కారణం.
అంతేకాదు.. ఇప్పటికే ఆ జట్టు టెస్టు సారథి టిమ్ ఫైన్‌తో పాటు కొందరు ఆసీస్ క్రికెటర్లు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తిస్తుండడంతో వైధ్యాధికారుల సూచనల మేరకు వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల దక్షిణ ఆస్ట్రేలియాలో జరిగిన షీఫెల్డ్ షీల్డ్ టోర్నీలో టిమ్ ఫైన్, మాథ్యూ హెడ్, ఇతర టెస్టు జట్టు ఆటగాళ్‌లు టాస్మానియా టైగర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించారు. అయితే అక్కడ కరోనా వ్యాప్తి పెరగడంతో.. టాస్మానియాకి తిరుగొచ్చినప్పటికీ సెల్ప్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని అధికారులు సూచించారు. ఆటగాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించారు.
సౌత్ ఆస్ట్రేలియాలోనే ఉన్న అడిలైడ్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇక్కడే భారత్-ఆసీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి జరగనుంది. కరోనా కారణంగా టెస్ట్ మ్యాచ్‌కు అడ్డంకులు ఏర్పడతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. షెడ్యూల్ ప్రకారమే టెస్టు మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని, అన్నీ నియంత్రణలోకి వస్తాయన్నారు.