తిలక్ వర్మ కోలుకున్నాడు.. అయినా ఆ రెండు మ్యాచ్‌లు ఆడడు..!

భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ తిల‌క్ వ‌ర్మ‌ గాయపడటంతో న్యూజిలాండ్ సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు.

By -  Medi Samrat
Published on : 26 Jan 2026 4:16 PM IST

తిలక్ వర్మ కోలుకున్నాడు.. అయినా ఆ రెండు మ్యాచ్‌లు ఆడడు..!

తిలక్ వర్మ

భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ తిల‌క్ వ‌ర్మ‌ గాయపడటంతో న్యూజిలాండ్ సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. శిక్షణను తిరిగి ప్రారంభించాడు. అయినా కూడా అతడు చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు టీమ్ ఇండియాకు అందుబాటులో ఉండ‌డు.

అతడి స్థానంలో టీ20 జట్టులోకి వ‌చ్చిన‌ శ్రేయాస్ అయ్యర్ సిరీస్ ముగిసే వరకు జట్టుతోనే ఉంటాడు. అయ్యర్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.. కానీ ప్రస్తుతం టీ20 జట్టులో స్థానం ద‌క్కించుకోలేక పోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో.. అయ్యర్ ఒక్కటి కూడా ఆడలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. భారత్ మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో ఉంది.

తిలక్ శిక్షణ ప్రారంభించాడని, అయితే అతను పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌లోకి తిరిగి రావడానికి సమయం పడుతుందని, అందువల్ల అతను చివరి రెండు టీ20 మ్యాచ్‌లలో జట్టుతో ఉండడని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. "తిలక్ వర్మ BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ ప్రారంభించాడు. క్రమంగా మెరుగుపడుతున్నాడు" అని BCCI ఒక ప్రకటనలో తెలిపింది. అతడు పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి సమయం పడుతుంది. అందువల్ల అతను చివరి రెండు టి 20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

టి20 ప్రపంచ కప్‌కు ముందు ఫిబ్రవరి 3న తిలక్ జట్టులో చేరుతారని బిసిసిఐ తెలిపింది. "అతను పూర్తి ఫిట్‌నెస్ పొందిన తర్వాత, ఫిబ్రవరి 3న ముంబైలో టి20 ప్రపంచ కప్ 2026 కోసం వార్మప్ మ్యాచ్‌లకు ముందు జట్టులో చేరతాడు" అని బిసిసిఐ తెలిపింది. న్యూజిలాండ్ సిరీస్ ముగిసే వరకు అయ్యర్ జట్టుతోనే ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. "తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మ్యాచ్‌లకు జట్టుతోనే ఉంటారని పురుషుల సెలక్షన్ కమిటీ ధృవీకరించింది" అని పేర్కొంది.

Next Story