Australia vs India : షాకింగ్.. ప్లేయింగ్-11 నుంచి తిలక్ వర్మ ఔట్..!
ఆస్ట్రేలియాతో జరిగే చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఓడాడు.
By - Medi Samrat |
ఆస్ట్రేలియాతో జరిగే చివరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఓడాడు. దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌పైనే సిరీస్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా లేదా ఈ మ్యాచ్ కొన్ని కారణాల వల్ల రద్దు చేయబడినా.. సిరీస్‌ను భారత్ గెలుచుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ 2-2తో ముగుస్తుంది. స్వదేశంలో సిరీస్ ఓటమిని తప్పించుకోవడమే ఆస్ట్రేలియా ముందున్న సవాల్.
ఈ కీలక మ్యాచ్‌లో భారత్ పెద్ద మార్పు చేసింది. ముంబై ఇండియన్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆడుతున్న తిలక్ వర్మ ప్లేయింగ్-11లో ఎంపిక కాలేదు. ఆసియా కప్-2025 ఫైనల్‌లో జట్టును విజయతీరాలకు చేర్చేందుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ ఈ మ్యాచ్‌లో ఆడకపోవడం పెద్ద లోటు. గత నాలుగు మ్యాచ్‌లలో తిలక్ వర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ప్లేయింగ్-11 లోచోటు దక్కకపోవడానికి కారణమని తెలుస్తుంది. అతని స్థానంలో ఫినిషర్ రింకూ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా తన ప్లే-11లో ఎలాంటి మార్పులు చేయలేదు.
రెండు జట్లలో ప్లేయింగ్-11
భారత్ : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (WK), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.