ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరుగుతున్న అనధికార వన్డే సిరీస్ లో తిలక్ వర్మ భారత జట్టును ఆదుకున్నాడు. కష్టాల్లో ఉన్న టీం ఇండియాకు గౌరవ ప్రదమైన స్కోర్ వచ్చేందుకు తిలక్ వర్మ ఇన్నింగ్స్ తోడ్పడింది. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్లాడు తిలక్ వర్మ. తిలక్ వర్మ 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ఆటగాళ్లు పెద్దగా పరుగులు చేయకపోవడంతో భారత జట్టు 45.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
టీమిండియా 17 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. 122 బంతులు ఆడిన తిలక్ వర్మ 94 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆసీస్-ఏ కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు.