'ఛేజ్ మాస్ట‌ర్' రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన తిలక్ వర్మ..!

తెలుగు తేజం తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.

By -  Medi Samrat
Published on : 15 Dec 2025 9:20 PM IST

ఛేజ్ మాస్ట‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన తిలక్ వర్మ..!

తెలుగు తేజం తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇన్నాళ్లుగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్ సమయంలో టెస్టు హోదా కలిగిన దేశాల తరఫున ఆడి కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తిలక్ ఇప్పుడు అత్యుత్తమ సగటుతో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో తిలక్ వర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో 34 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్‌ వర్మ సగటు 68.0 కాగా, విరాట్ కోహ్లీ 67.1 తో ఉన్నాడు. వర్మ తర్వాత స్థానంలో ఎంఎస్ ధోనీ 47.71 తో ఉన్నాడు.

Next Story