సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టిన తిల‌క్ వ‌ర్మ‌, అక్షర్ పటేల్..!

విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ 5వ దశలో హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు.

By -  Medi Samrat
Published on : 3 Jan 2026 6:23 PM IST

సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టిన తిల‌క్ వ‌ర్మ‌, అక్షర్ పటేల్..!

విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ 5వ దశలో హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఆంధ్రాపై 130 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌కు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ తిలక్ వర్మ సెంచరీ సాధించాడు. చండీగఢ్‌పై 118 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 109 పరుగులు చేశాడు.

కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఆధారంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. జట్టులో తిలక్‌తో పాటు అభిరత్‌ రెడ్డి 71 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చండీగఢ్‌ తరఫున జగ్జీత్‌ సింగ్‌ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ విజ‌యం సాధించింది.

ఆంధ్రాపై గుజరాజ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తుఫాను బ్యాటింగ్ చేశాడు. గాయం నుండి కోలుకుని వచ్చిన తర్వాత అక్ష‌ర్ మొదటిసారి మైదానంలోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో 111 బంతుల్లో 130 పరుగులు చేశాడు. అక్షర్ తన ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 10 ఫోర్లు కొట్టాడు.

గుజరాత్ తరపున రవి బిష్ణోయ్ చివరి క్షణాల్లో 20 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడగా.. విశాల్ జైస్వాల్ 60 బంతుల్లో 70 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగులు చేసింది. ఆంధ్రా తరఫున కెప్టెన్ నితీష్ రెడ్డి 2 వికెట్లు తీయగా, సత్యనారాయణ రాజు 4 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆంధ్రా 7 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది.

Next Story