ఐపీఎల్ స్టార్ పై అత్యాచారం ఆరోపణలు.. 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు..!

THIS IPL star and international cricket CAPTAIN accused of RAPE of minor girl. నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన మాజీ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానే

By Medi Samrat  Published on  7 Sept 2022 7:08 PM IST
ఐపీఎల్ స్టార్ పై అత్యాచారం ఆరోపణలు.. 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు..!

నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన మాజీ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానేపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఖాట్మండులో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఫిర్యాదును నమోదు చేసినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) ఆడేందుకు ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్న లామిచానే నుండి ఇంకా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

"నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానేపై అత్యాచారం ఆరోపణలపై 17 ఏళ్ల వయస్సు గల మైనర్ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు" అని నేపాల్ పోలీసులు బుధవారం నాడు ANIకి తెలిపారు. ఓ హోటల్‌లో సందీప్ లామిచానే తనపై అత్యాచారం చేశాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆగస్టు 21న జరిగింది. స్నేహితురాలి ద్వారా సందీప్ లామిచానేను కలిశానని, ఆగస్టు 17న ఇద్దరూ నాగర్‌కోట్‌కు వెళ్లామని బాలిక తెలిపింది. ఈ సంఘటన ఆగస్టు 21న జరిగింది. మరుసటి రోజు సందీప్ లామిచానే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ని ఆడేందుకు కెన్యాకు బయలుదేరాడు. అతనిపై ఆరోపణలు చేసిన మైనర్ బాలిక ఇప్పుడు పోలీసుల రక్షణలో ఉంది.


Next Story