ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా పోయెనే!!
ప్రపంచ కప్ కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎలాంటి ప్రాక్టీసు లభించలేదు
By అంజి Published on 3 Oct 2023 2:19 PM GMTప్రపంచ కప్ కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎలాంటి ప్రాక్టీసు లభించలేదు. ఇప్పటికే ఇంగ్లండ్ తో మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దు కాగా, నేడు నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కేవలం టాస్ మాత్రమే పడింది. ఇవాళ టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సిన ప్రాక్టీసు మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయింది. వర్షం ఏ మాత్రం తక్కపోవడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేదని.. మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 8న ఆసీస్ తో ఆడనుంది. అన్ని జట్లూ ఇప్పటికే ఫైనల్ జట్లను ప్రకటించాయి. కొన్ని జట్లు చివర్లో కీలక మార్పులతో తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టు గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంది.
Next Story