బీస్ట్ డైరెక్టర్‌పై విరుచుకుపడిన విజయ్ తండ్రి

Thalapathy Vijay's father SA Chandrasekar blasts Beast director Nelson Dilipkumar. తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ ‘బీస్ట్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పై

By Medi Samrat  Published on  20 April 2022 3:30 PM
బీస్ట్ డైరెక్టర్‌పై విరుచుకుపడిన విజయ్ తండ్రి

తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ 'బీస్ట్' డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి SA చంద్రశేఖర్, బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ స్టార్ పవర్‌పై సినిమా ఆధారపడి ఉందని, స్క్రీన్‌ప్లే సరైన స్థాయిలో లేదని ఆయన అన్నారు. చంద్రశేఖర్ మరింత వివరిస్తూ.. బీస్ట్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తుందని, అయితే స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్ లేదని కొట్టి పడేశారు.

సినిమాపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి తీసి ఉంటే బాగుండేదన్నారు. డైరెక్షన్ తో సినిమాకు పేరు రాలేదని, తన కుమారుడుకు ఉన్న స్టార్ డమ్ వల్లే 'బీస్ట్' సినిమా ఇంకా నడుస్తోందని, వసూళ్లు వస్తున్నాయని చెప్పారు. బీస్ట్ సినిమా హిట్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని.. అది తన కుమారుడికి ఉన్న పేరుతోనే వచ్చిందన్నాడు.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్ వంటి సీరియస్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకున్నప్పుడు ఇంకాస్త వర్క్ చేయాల్సింది. ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లేతో ఓ మ్యాజిక్ చెయ్యొచ్చు. కానీ, బీస్ట్ లో ఆ మ్యాజిక్ లేనే లేదని విమర్శించారు. సినిమా హిట్టయ్యింది కేవలం తన కుమారుడి స్టార్ డమ్, సంగీత దర్శకుడు, ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, ఎడిటర్ వల్లేనని తేల్చి చెప్పారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసినప్పటికీ, విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది.













Next Story