Champions Trophy : మేము అలా చేయలేకపోయాం.. కివీస్‌పై ఓటమికి కారణాలు చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ సెమీఫైనల్లో ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా చాలా నిరాశ చెందాడు.
By Medi Samrat Published on 6 March 2025 9:10 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ సెమీఫైనల్లో ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా చాలా నిరాశ చెందాడు. తన సాఫ్ట్ అవుట్, మిడిల్ ఆర్డర్‌కు బలమైన పునాదిని ఏర్పాటు చేయడంలో విఫలమవడం పట్ల చాలా నిరాశ చెందాడు. 363 పరుగుల సవాలుతో కూడిన లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన దక్షిణాఫ్రికా 23వ ఓవర్‌కు 1 వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. బావుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ రెండవ వికెట్‌కు 105 పరుగుల ఆశాజనక భాగస్వామ్యాన్ని నిర్మించి.. జట్టును పోటీలో నిలిపారు. కానీ ఇద్దరు బ్యాటర్లు ఔటవ్వడంతో ఇన్నింగ్సు వేగానికి బ్రేక్ పడింది.
మ్యాచ్ అనంతరం టెంబా బావుమా మాట్లాడుతూ.. కనీసం 30వ ఓవర్ వరకు మేమిద్దరం ఆడటం కొనసాగించాలని అనుకున్నాం. చివరి 20 ఓవర్లలో మా మిడిల్ ఆర్డర్ ఎంత విధ్వంసకరంగా ఉంటుందో మాకు తెలుసు.. దురదృష్టవశాత్తు.. మేము వారికి బలమైన పునాది వేయలేకపోయాము. కనీసం నా వైపు నుండి అయినా కూడా అది జరగలేదు.. సాప్ట్ అవుట్ అయ్యాను. ఇది మా మిడిల్ ఆర్డర్‌కు చాలా లక్ష్యాన్ని మిగిల్చిందని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నాడు. ఇంత భారీ స్కోరు సాధించేటప్పుడు బ్యాట్స్‌మెన్లందరి నుండి స్థిరమైన ప్రదర్శనలు అవసరమని పేర్కొన్నాడు.
డేవిడ్ మిల్లర్ 67 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడినప్పటి.. ఇతర బ్యాట్స్‌మెన్ నుండి అతనికి అవసరమైన మద్దతు లభించకపోవడంతో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 312 పరుగులు చేసింది.
లక్ష్యం ఎక్కువగా ఉంది.. వారు బ్యాటింగ్ చేసినట్లే.. 350 కంటే ఎక్కువ.. 350 దగ్గర్లో లక్ష్యం ఉంటే స్కోరును ఛేదించడానికి మాకు వీలు అవుతుందని భావించామని.. మేము నిజంగా భాగస్వామ్యాలను పొందలేకపోయాము. కివీస్ ఇన్నింగ్సులో ఒకటి లేదా రెండు భాగస్వామ్యాలు ఉన్నాయి.. వారి టాప్ ఫోర్ బ్యాటర్లు చేసిన దానిని మేము చేయలేకపోయాం. 360 లక్ష్యం కఠినమైంది. బాగా ఆడేవారు అవసరం. మా తరుపున డేవిడ్ మంచి ఇన్నింగ్సు ఆడాడు.. బహుశా మరొకరు అతడిలా అడివుండాల్సింది అన్నాడు.
కివీస్ మమ్మల్ని ఆరంభంలోనే ఒత్తిడిలో నెట్టింది. కేన్ విలియమ్సన్, రాచిన్, వారి తర్వాత వచ్చిన కుర్రాళ్ళు - మిచెల్, ఫిలిప్స్ లకు విన్నింగ్ క్రెడిట్ దక్కుతుంది. వారు బ్యాటింగ్ తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు..
న్యూజిలాండ్ బ్యాటింగ్ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ చుట్టూ తిరుగుతుంది, ఇద్దరూ సెంచరీలు నమోదు చేశారు. తాను లేదా వాన్ డెర్ డస్సెన్ అలాగే ఆడి చివరి దశ వరకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టి ఉంటే బాగుండేది. రవీంద్ర 108, విలియమ్సన్ 102 పరుగుల ఇన్నింగ్సులను బావుమా ప్రశంసించాడు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కూడా దక్షిణాఫ్రికాకు మ్యాచ్‌ను దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారని బావుమా పేర్కొన్నాడు.