బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోల్పోవడంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి టెస్టులో ఘోర ఓటమితో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న భారత్ ఇంటి ముఖం పట్టింది. సిడ్నీ టెస్టులో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 3 - 1 తేడాతో బీజీటీ సిరీస్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 141/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 16 పరుగులు మాత్రమే జోడించి ఆల్ అవుట్ అయ్యింది.
162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి కేవలం 27 ఓవర్లలోనే ఛేదించింది. ఖవాజా 41, హెడ్ (34*), వెబ్‌స్టర్ (39*), కొనస్టాస్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా బౌలింగ్ రాలేదు. జస్ప్రీత్ బుమ్రా 3వ రోజు భారత బౌలింగ్ ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ ఫీల్డింగ్ తీసుకోలేక పోవడంతో ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా యొక్క అద్భుతమైన పర్యటన యాంటీ-క్లైమాక్టిక్ ముగింపుకు వచ్చింది.
మొదటి టెస్ట్ గెలుపుతో మరోసారి ఫైనల్ చేరి టెస్ట్ గద సొంతం చేసుకుంటుందని భావించారంతా. ఆ తర్వాత టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, బుమ్రా మినహా బౌలర్లు రాణించకపోవడంతో భారత్ సిరీస్ కోల్పోయింది. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన ఆసీస్ లార్డ్స్‌లో సౌతాఫ్రికాతో జూన్ 11న తలపడనుంది.