టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌ షెడ్యూల్ వచ్చేసింది..!

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

By Medi Samrat
Published on : 31 March 2025 8:45 PM IST

టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌ షెడ్యూల్ వచ్చేసింది..!

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా స్వదేశంలో వేసవి కాలంలో మ్యాచ్‌లను నిర్ధారించేసింది. ఈ ఏడాది చివర్లో భారతదేశం ఎనిమిది వైట్-బాల్ మ్యాచ్‌లను ఆడటానికి ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. యాషెస్ షెడ్యూల్‌ను ఇప్పటికే ధృవీకరించిన క్రికెట్ ఆస్ట్రేలియా, భారత్ తో సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియాలో ఆ సమయంలో వేసవి సెలవులు ఉండడం, భారత జట్టు పర్యటనతో క్రికెట్ అభిమానులకు కావాల్సిన వినోదం దక్కనుంది.

వన్డే సిరీస్

తొలి వన్డే- అక్టోబరు 19 (పెర్త్)

రెండో వన్డే- అక్టోబరు 23 (అడిలైడ్)

మూడో వన్డే- అక్టోబరు 25 (సిడ్నీ)

టీ20 సిరీస్

తొలి టీ20- అక్టోబరు 29 (కాన్ బెర్రా)

రెండో టీ20- అక్టోబరు 31 (మెల్బోర్న్)

మూడో టీ20- నవంబరు 2 (హోబర్ట్)

నాలుగో టీ20- నవంబరు 6 (గోల్డ్ కోస్ట్)

ఐదో టీ20- నవంబరు 8 (బ్రిస్బేన్)

Next Story